Yesu rakthamu Telugu Christian songs


 యేసు రక్తము ప్రతి పాపమునుండి విడిపించును విమోచించును(2)

జయమే మరి విజయమే యేసు రక్తము(4)


ప్రతి మనుష్యుని కొరకై నా యేసు కల్వరి కొండపై బాలియాయెను(2)

కారుచున్నది యేసు రక్తము కడుగుచున్నది ప్రతి మనుష్యుని పాపము(2)


మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకై చనిపోయెను (2)

కాబట్టి క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్ష విధియును లేకపోయెను(2)


పునరుత్థనము నా యేసే నిత్యజీవము నా యేసే(2)

విశ్వసించు ప్రతివాడు నశియించకను నిత్యరాజ్యానికి వారసుడగును(2)

                  Download MP3

Post a Comment

0 Comments