Singer : Bro A.R Stevenson
ఏమని వర్ణింతును నీ మహిమను
ఏ రీతి వివరింతును నీ ఘనతను
వేనోళ్ళ పొగడినా ఎన్నేళ్ళు పాడినా
నిను కొనియాడను నా తరమా
1. ఏడు నక్షత్రములు చేతపట్టినవాడా
వాడియైన ఖడ్గం నోట కలిగిన వాడా
సువర్ణ దీపస్తంభములమధ్య
సంచరించుచున్న పరిశుద్ధుడా
2. మొదటివాడా కడపటివాడా
మృతుడై మరలా బ్రతికినవాడా
మరణముయొక్క తాళపు చెవులు
స్వాధీనమందున్న స్తుతిపాత్రుడా
3. ఆమేన్ అనువాడా సత్యస్వరూపుడా
అగ్నిజ్వాలలవంటి కన్నులుగలవాడా
విస్తారజలముల ధ్వనిని పోలిన
కంఠస్వరము కలిగిన దేవుడా
0 Comments