Singer: Kalpana
ప్రయాసతో పరుగులెత్తినా పొందాలని ఆశించినా (2)
కరుణించు దేవా నీ కృపచేతనే (2)
కార్యాలు నెరవేరును కోరికలన్నీ తీరును
1. కన్నీటితో నీకు మొరపెట్టినా
ఉపవాసపు దీక్షపట్టి కనిపెట్టినా (2)
ప్రార్థన వినుదేవా నీ కృప చేతనే (2)
మనవులు సన్నిధిని చేరును - త్వరగా జవాబు దొరకును ( ప్రయాసతో) 2 సార్లు
2. కుడి ప్రక్కను పదివేలమంది కూలినా
హతమార్చను శత్రువులు చుట్టు చేరినా (2)
రక్షించు దేవా నీ కృపచేతనే (2)
అపాయములు తొలగిపోవును క్షేమము నెమ్మదియు కలుగును (ప్రయాసతో) 2సార్లు
3. తెలివితేటలెన్నో ఉపయోగించినా
బలశౌర్యములన్నీ ప్రయోగించినా (2)
దీవించు దేవా నీ కృపచేతనే (2)
చేతిపనుల ఫలితముండును ధాన్యముతో కొట్లు నిండును
(ప్రయాసతో) 2 సార్లు (కరుణించు) 2 సార్లు
(కార్యాలు)
0 Comments